ఎన్టీఆర్ ‘పాన్ ఇండియా’ ఇమేజ్ కోసం కొరటాల మార్పులు !

Published on May 3, 2021 12:00 am IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా సినిమా వస్తుందని ఎనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకే, ఆ అంచనాలను అందుకోవడానికి ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ వర్క్ పై కూర్చున్నాడు. ఎలాగూ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆచార్యకి మరో నెల రోజులు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ను కొరటాల ఎన్టీఆర్ స్క్రిప్ట్ కోసం వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ లో కొరటాల కొన్ని మార్పులు చేస్తున్నాడట. నిజానికి గతంలోనే ఈ స్క్రిప్ట్ ను ఫినిష్ చేసినప్పటికీ.. ప్రస్తుతం ఎన్టీఆర్ కు రాబోయే పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని కొరటాల ఫిక్స్ అయ్యాడు. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాను కూడా కొరటాల మెసేజ్ తో సాగే పక్కా ఎంటర్ టైనర్ గా తీస్తాడట.

మొత్తానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉండేలా కొరటాల ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. పైగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :