“సెబాస్టియన్‌” నుంచి “సెబా..” లిరికల్ సాంగ్ రిలీజ్..!

Published on Feb 24, 2022 8:30 pm IST

“రాజావారు రాణిగారు” చిత్రంతో టాలీవుడ్‌కి హీరోగా పరిచయమైన కిరణ్‌ అబ్బవరం తన తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత “ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం” సినిమాతో క్లాస్, మాస్, యూత్‌, ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నటించిన చిత్రం “సెబాస్టియ‌న్ పి.సి. 524”. జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, బాలాజీ సయ్యపురెడ్డి ద‌ర్శ‌కునిగా పరిచయమవుతున్నాడు. మార్చి 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి “సెబా” అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్. వేదనలో వేడుకలా వెలుగు సెబా.. రాజాధి రాజా..! అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ “మా ‘సెబాస్టియన్‌ పిసి524’ సినిమాతో కిరణ్ అబ్బవరం ఖచ్చితంగా హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుంటాడని, ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ‘హేలీ..’ అనే పాటకు మంచి స్పందన లభించింది. ఇప్పుడీ ‘సెబా…’ పాట సైతం విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంది. జిబ్రాన్‌ సంగీతం దర్శకత్వంలో పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్‌ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశం. మార్చి 4వ తేదీన ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారని అన్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :