నిఖిల్ కు రెండో హీరోయిన్ కూడా దొరికేసింది !

22nd, October 2017 - 01:57:39 PM

రెగ్యులర్ సినిమాలను పక్కనబెట్టి భిన్నమైన కథల్నే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ ప్రస్తుతం కన్నడ సూపర్ హిట్ మూవీ ‘కిరిక్ పార్టీ’ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇటీవలే ఉత్తరాఖంఢ్ వంటి నార్త్ ఇండియా లొకేషనల్లో ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా సంయుక్తా హెగ్డే ఇదివరకే నిర్ణయించబడగా ఇప్పుడు రెండో హీరోయిన్ కూడా దొరికేసింది.

ఆమే సిమ్రన్ పరీంజ. ఈమె గతంలో పలు హిందీ టీవీ సీరియళ్లలో నటించింది. నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో నడవనున్న ఈ సినిమాలో నిఖిల్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అంతేగాక ఈ పాత్ర కోసం వర్కవుట్స్ చేస్తూ లుక్ కూడా మార్చేశాడు. ఇందులో మరొక విశేషమేమిటంటే నిఖిల్ కు మంచి మిత్రులైన దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తుండగా సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.