బాలయ్య నుండి మరో ఎక్సయిటింగ్ అప్డేట్.

Published on Dec 10, 2019 5:08 pm IST

నందమూరి నటసింహం బాలకృష్ణ తన లేటెస్ట్ మూవీ రూలర్ నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. రూలర్ చిత్రంలోని మరొక సాంగ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు సాయంత్రం 05:05 నిమిషాలకు ‘పడ్తాడు తాడు..’ అనే లిరికల్ వీడియో విడుదల చేయనున్నారట. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది.ఇది బాలయ్య మరియు సోనాల్ చౌహాన్ మధ్య వచ్చే కమర్షియల్ డ్యూయట్ సాంగ్ అని సమాచారం. ఇప్పటికే విడుదలైన ‘అడుగడుగో యాక్షన్ హీరో..’ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది. రూలర్ ట్రైలర్ కూడా యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్ 5లో కొనసాగుతుంది.

రూలర్ మూవీలో బాలకృష్ణ రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నారు. దేవా అనే పోలీస్ అధికారి పాత్ర మరియు కార్పొరేట్ బిజినెస్ మెన్ పాత్ర ఆయన చేయడం జరిగింది. నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తుండగా సీనియర్ దర్శకుడు సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. వేదిక మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్ అందించారు. క్రిస్మస్ కానుకగా ఈ నెల 20న రూలర్ మూవీ విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం :