ఎన్టీఆర్ బయోపిక్ నుండి రెండవ సాంగ్ విడుదలకానుంది !

ఎన్టీఆర్ బయోపిక్ నుండి రెండవ సాంగ్ విడుదలకానుంది !

Published on Dec 10, 2018 10:58 AM IST

నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తున్నచిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. ఇటీవల ఈ చిత్రంలోని’కథానాయక’ అంటూ సాగే టైటిల్ ట్రాక్ ని విడుదల చేయగా తాజాగా ఈ చిత్రంలోని ‘రాజర్షి’ అంటూ సాగె రెండవ సాంగ్ ను డిసెంబర్ 12న ఉదయం10:30 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని తెలిసిందే దాంట్లో మొదటి భాగం ‘కథానాయకుడు’ వచ్చే ఏడాది జనవరి 9న విడుదలకానుండగా రెండవ భాగం ‘మహానాయకుడు’ జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో విద్యాబాలన్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా రానా , రకుల్ ప్రీత్ సింగ్ , నిత్య మీనన్ , హన్సిక తదితరులు అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు