“సీతా రామం” నుండి ఇంతందం లిరికల్ వీడియో రిలీజ్!

Published on Jul 4, 2022 5:36 pm IST


మాలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్ తరువాతి చిత్రం అయిన సీతా రామం, పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాలో నటించనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ఆగస్ట్ 5, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు అందుకు అనుగుణంగా మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేయడం జరిగింది. ఈ రోజు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.

ఇంతందం అనే టైటిల్ తో రూపొందిన ఈ పాటను విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచారు. ఎస్‌పిబి చరణ్‌ పాడిన ఈ ట్రాక్ చాలా బాగుంది. కృష్ణకాంత్ రాసిన ఈ పాట దుల్కర్ మరియు మృణాల్ ఠాకూర్ ల అందమైన ప్రేమకథను చూపించింది. లవ్లీ ఆర్కెస్ట్రేషన్ ఈ మెలోడీకి క్లాస్ టచ్ తెచ్చింది. రష్మిక మందన్న ఈ చిత్రం లో మరో హీరోయిన్ పాత్రలో కనిపించనుంది. ఈ బహుభాషా చిత్రంలో సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :