మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ‘అస్సలు సినిమా’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
“ఆహా ఓహో అంటాడు.. అందం నీదే అంటాడు” అంటూ సాగే ఈ పాటను ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రాయగా, శ్రేయా ఘోషల్ అద్భుతంగా ఆలపించారు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, ఐశ్వర్య అర్జున్ గ్లామర్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూ శ్రోతలను ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రలు పోషిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా ప్రత్యేక పాత్రల్లో మెరవనున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు, జి. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


