తమిళంలోకి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’!

Atharintiki-Dharedhi,-SVSC,
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. సూపర్ స్టార్ మహేష్, విక్టరీ వెంకటేష్‌లు కలిసి నటించిన భారీ మల్టీస్టారర్. 2013లో సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళంలోకి డబ్ కానుంది. కుటుంబ విలువలు, ప్రేమ, అన్నదమ్మల బంధాలను హృద్యంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుత కాలానికి ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా నిలిచిందనడంలో సందేహం లేదు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించారు.

తాజాగా ఈ సినిమా తమిళంలో విడుదలయ్యే విషయంపై ఒక స్పష్టత వచ్చింది. నిజానికి తమిళంలో ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా సరైన సమయం కోసం తమిళంలో విడుదల చేస్తున్న నిర్మాతలు ఎదురుచూశారు. ఇప్పుడు వేసవి సెలవులు కావడంతో సినిమా విడుదలకు సరైన సమయంగా భావిస్తున్నారట. త్వరలోనే ‘ఆనందం ఆనందం’ పేరుతో ఈ సినిమా తమిళంలో విడుదల కానున్నట్లు సమాచారం.

Exit mobile version