“సీటిమార్” ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్..!

Published on Sep 4, 2021 2:24 am IST


టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “సీటిమార్”. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం నుంచి ఆగష్ట్ 31వ తేదిన హీరో రామ్ పోతినేని చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ట్రైలర్‌కి యూట్యూబ్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ట్రైలర్ కోటి వ్యూస్‌ని రాబట్టింది. అంతేకాదు 196కే లైక్స్‌ని సాధించింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న మంచి అంచనాల మధ్య రిలీజ్ కాబోతుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :