రేపే సీటిమార్ ట్రైలర్ రిలీజ్..!

Published on Aug 30, 2021 10:00 pm IST

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “సీటిమార్”. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

రేపు మధ్యాహ్నం 2:53 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :