ఆహాలోకి వచ్చేస్తున్న “సెహరి”.. డేట్ ఫిక్స్..!

ఆహాలోకి వచ్చేస్తున్న “సెహరి”.. డేట్ ఫిక్స్..!

Published on Feb 19, 2022 3:00 AM IST

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “సెహరి”. వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలై పర్వాలేదనిపించుకుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కి సిద్దమయ్యింది.

తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహాలో ఫిబ్రవరి 25వ తేదిన “సెహరి” ఓటీటీలోకి వస్తుందని తాజాగా ఆహా తెలిపింది. ఈ చిత్రంలో హీరోకి తండ్రిగా సంగీత దర్శకుడు కోటి నటించగా, అభినవ్ గోమఠం తన కామెడీతో ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు