“లవ్ స్టోరీ” మేకర్స్ త్వరపడాలని చూస్తున్నారా.?

Published on Jul 7, 2021 10:00 am IST

మన టాలీవుడ్ మ్యాజికల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “లవ్ స్టోరీ”. అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొల్పుకుని రెడీ అయ్యింది. అయితే చాలా కేర్ గా సినిమా షూట్ ని అంతటిని కంప్లీట్ చేసేసిన మేకర్స్ సినిమా విడుదలకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు.

నిజానికి గత ఏప్రిల్ నెలలోనే భారీ స్థాయి విడుదలకు ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ కరోనా తీవ్రత మూలాన తాత్కాలికంగా నిలిపివేసింది. మరి ఇప్పుడు ఈ చిత్రం విడుదల విషయంలో మేకర్స్ త్వరపడాలని చూస్తున్నారట. ఎలాగో ఏపీలో థియేటర్స్ తెరుచుకోవడం మొదలు కానుంది దీనితో తొందరగానే ఈ సినిమాను విడుదల చెయ్యాలని మేకర్స్ అనుకుంటున్నారట. మరి తాజాగా సినీ వర్గాల్లో అయితే ఈ జూలై ఆఖరున జూలై 30న ఈ సినిమాని విడుదల చేస్తారని టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ రాబల్సి ఉంది.

సంబంధిత సమాచారం :