ఎన్టీఆర్ బయోపిక్ లో మరో సీనియర్ నటుడు !

Published on Jul 11, 2018 2:52 pm IST

దర్శకుడు క్రిష్, నటరత్న ఎన్టీఆర్ జీవితకథను తెరకెక్కించబోతున్న విషయం తేలింసిదే. బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 5 నుంచి ఈ చిత్ర షూటింగ్ మొదలయింది. ఇప్పటికే ఈ చిత్రంలో విద్యాబాలన్, రానా, సచిన్ కేడెకర్, మోహన్ బాబు వంటి భారీ తారాగణం నటిస్తున్నారు.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో సీనియర్ నటుడు నరేష్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా నందమూరి బాలకృష్ణే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :