సుమంత్ సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ కి సుహాసిని.!

Published on Aug 6, 2021 9:56 pm IST


“మళ్ళీ రావా”, “సుబ్రహ్మణ్యపురం” సినిమాలతో టాలీవుడ్ లో మంచి కం బ్యాక్ ఇచ్చిన హీరో సుమంత్ ప్రస్తుతం మరిన్ని ఆసక్తికర సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి అలా చేస్తున్న తాజా ప్రాజెక్టులలో దర్శకుడు టీజీ కీర్తి కుమార్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “మళ్ళీ మొదలైంది” కూడా ఒకటి.

మరి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలోకి కీలక పాత్ర పోషించేందుకు ప్రముఖ సీనియర్ నటి సుహాసిని కి ఆహ్వానం పలుకుతున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అలాగే ఆమె ఈ చిత్రంలో సుమంత్ కి తల్లి పాత్రలో ఒక సింగిల్ మథర్ గా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో బోల్డ్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటుందని కూడా ఇన్ఫో ఇచ్చారు.

మరి ఈ చిత్రంలో సుమంత్ సరసన బోల్డ్ బ్యూటీ నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తుంగాడా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే రెడ్ సినిమాస్ బ్యానర్ పై కె రాజ శేఖర్ రెడ్డి రెడ్డి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :