66 ఏళ్ళ వయసులో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్న నటి

Published on Jul 16, 2019 3:01 am IST

ఒకప్పుడు కథానాయికలుగా ఒక వెలుగు వెలిగిన నటీమణులు ఆ తరవాతి కాలంలో తల్లి, పిన్ని, వదిన లాంటి సపోర్టింగ్ రోల్స్ చేయడం మామూలే. ఈ సెకండ్ ఇన్నింగ్స్ కూడా కొన్నాళ్లే. ఆ తరవాత మెల్లగా తెర మీది నుండి కనుమరుగవుతుంటారు చాలామంది. కానీ సీనియర్ నటి లక్ష్మీ మాత్రం అలా కాదు 66 ఏళ్ల వయసులో థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

ఒకప్పుడు కథానాయకిగా అలరించిన ఆమె ఆ తరవాత అమ్మ లాంటి చాలా సపోర్టింగ్ రోల్స్ చాలా చేశారు. మధ్యలో గ్యాప్ వచ్చినా నిలబడి మళ్ళీ ఇప్పుడు నటిగా బాగా బిజీ అయిపోయారు. ఈమధ్యే సమంత చేసిన ‘ఓ బేబీ’ చిత్రంలో నటించి మెప్పించిన ఆమె త్వరలో విడుదలకానున్న నాగార్జున యొక్క ‘మన్మథుడు 2’లో ఆయనకు తల్లిగా నటించారు. అలాగే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని చేస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో కూడా ఈమె బామ్మగా ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్నారు. స్వతహాగా గొప్ప నటి కావడం, ఈ వయసులో కూడా చలాకీగా ఉండటంతో ఇక మీదట కూడా ఆమెకు తెలుగులో తప్పక అవకాశాలుంటాయి.

సంబంధిత సమాచారం :

X
More