చిరంజీవి ఫోజులు పై సీనియర్ దర్శకుడు క్రేజీ కామెంట్స్ !

చిరంజీవి ఫోజులు పై సీనియర్ దర్శకుడు క్రేజీ కామెంట్స్ !

Published on Jan 26, 2026 6:00 PM IST

Chiranjeevi

“మన శంకర వరప్రసాద్ గారు” సినిమా సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ‘చిరంజీవి నాకన్నా చిన్నవాడు. అయినా బాబాయ్ అని పిలుస్తుంటాను. నాకు మెయిన్ క్రెడిట్ ఏంటంటే.. స్వర్గీయ ఎన్టీఆర్ తో నేను 12 సినిమాలు చేస్తే.. చిరంజీవితో 14 సినిమాలు చేశాను. జగదేక వీరుడు ఆయనే.. అతిలోక సుందరి ఆయనే. హీరోయిన్ లేకపోయినా ఆయన తన ఫోజులతోనే ఆకర్షిస్తాడు” అని రాఘవేంద్ర రావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

అలాగే, రాఘవేంద్ర రావు ఇంకా మాట్లాడుతూ.. ‘అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయాలి అని చిరంజీవితో చెప్పింది మొదట నేనే. ఐతే, ఒక చిన్న విత్తనం నాటితే, అది ఆపిల్ చెట్టు వస్తుంది అనుకున్నా. కానీ, వటవృక్షం వచ్చి మరి చెట్టు అయిపోయింది’ అని రాఘవేంద్ర రావు అన్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా సంక్రాంతికి స్పెషల్ గా విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

తాజా వార్తలు