ఓటీటీలో ‘శంబాల’ భారీ విజయం.. ఐదు రోజుల్లోనే.. ?

ఓటీటీలో ‘శంబాల’ భారీ విజయం.. ఐదు రోజుల్లోనే.. ?

Published on Jan 26, 2026 2:00 PM IST

Shambala

విలక్షణ నటుడు ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన డిఫరెంట్ హారర్ ఎంటర్‌టైనర్ ‘శంబాల’ కు యగంధర్ ముని దర్శకత్వం వహించారు. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలు. ఐతే, ఈ సినిమా జనవరి 21, 2026న ఆహాలో ప్రీమియర్ అయింది. కాగా, ఈ చిత్రం ఓటీటీలో చాలా త్వరగా ప్రజాదరణ పొంది, కేవలం 5 రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసింది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెంత ఆదరణ పొందుతుందో చూడాలి.

ఇదిలా ఉండగా, ఓటీటీలో దీని హిందీ వెర్షన్ కోసం ఇంకా ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో స్వాసిక విజయ్, మధునందన్, రవి వర్మ మరియు లక్ష్మణ్ మీసాల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. మొత్తానికి ఈ ‘శంబాల’ చిత్రం ఒక డీసెంట్ డివోషనల్ అండ్ సైన్స్ మిక్స్డ్ థ్రిల్లర్ గా సాగింది.

తాజా వార్తలు