రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘డేవిడ్ రెడ్డి’. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మనోజ్ ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. మొత్తానికి డిఫరెంట్ లుక్‌లో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ ను పంచుకున్న మనోజ్.. ‘నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే పాత్ర. ఎంతో క్రూరమైన, క్షమాగుణం లేనిది’ అని క్యాప్షన్ కూడా పెట్టారు.
ఇక ‘డేవిడ్ రెడ్డి’ కథ విషయానికొస్తే.. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఇది. బ్రిటిష్ వారిపై పోరాడిన ‘డేవిడ్ రెడ్డి’ అనే యోధుడి కథగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘వార్ డాగ్’ అనే బైక్‌ను రూపొందించారు. దాని బరువు దాదాపు 700 కేజీలు. సినిమాలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నట్టు ఈ సినిమాలో మనోజ్ సరసన ‘ప్రిన్స్’ (కోలీవుడ్ మూవీ) హీరోయిన్ మరియా నటించబోతుంది.


