16 ఏళ్ల యువ కంపోజర్ తో సీనియర్ దర్శక నిర్మాత రిస్క్.!

Published on Sep 7, 2021 4:59 pm IST

మన టాలీవుడ్ సీనియర్ మోస్ట్ నిర్మాత ఇప్పుడు టర్న్డ్ డైరెక్టర్ ఎం ఎస్ రాజు తన డైరెక్షన్ తో టాలీవుడ్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఆ మధ్య వచ్చిన బోల్డ్ అటెంప్ట్ “డర్టీ హరి” ఓటిటి లో వచ్చినా మంచి టాక్ ను తెచ్చుకుంది అంతే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మరి ఆ కొత్త అటెంప్ట్ తో విజయం అందుకున్న ఈ ఫిల్మ్ మేకర్ మళ్ళీ అదే తరహాలో మరో కొత్త సబ్జెక్టు ని టేకప్ చేశారు.

అదే “7 డేస్ 6 నైట్స్”. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శరవేగంగా కూడా కంప్లీట్ చేశారు. అయితే ఈ సినిమాకి సంగీతం పనిని కేవలం 16 ఏళ్ళు కుర్రాడు సమర్థ్ గొల్లపూడి కి ఇవ్వడం మరింత ఆసక్తికర అంశం. మరి ఈ అంశం పరంగా ఒక సీనియర్ దర్శక నిర్మాత రిస్క్ తీసుకోవడం వంటిదే అని చెప్పాలి.

ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై వర్క్ చేస్తున్నారు. అయితే మరి ఇతర సీనియర్ దర్శకులు అంతా స్టార్ సంగీతం దర్శకులు తో వర్క్ చేస్తున్న క్రమంలో ఈ యంగ్ కంపోజర్ తో ఎం ఎస్ రాజు రిస్క్ తీస్కొని వర్క్ స్టార్ట్ చెయ్యడం ఆసక్తిగా మారింది. మరి ఈ యువ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి చాలా ట్రెండీ ట్యూన్స్ ఇస్తున్నాడట. వాటిని ఆలపించాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాలి.

సంబంధిత సమాచారం :