ఫ్యాంటసీ జానర్లో కృష్ణవంశీ కొత్త సినిమా?

ఫ్యాంటసీ జానర్లో కృష్ణవంశీ కొత్త సినిమా?

Published on Sep 23, 2015 1:17 PM IST

krishna-vamsi
కృష్ణవంశీ సినిమా అంటే తెలుగు సినీ అభిమానికి ఓ ప్రత్యేకమైన అభిమానం ఎప్పుడూ ఉంటుంది. సున్నితమైన భావోద్వేగాలు, కథలను తనదైన మార్క్ సినిమాలుగా రూపొందించి తెలుగులో క్రియేటివ్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారాయన. అంత:పురం, మురారి, నిన్నే పెళ్ళాడతా, సింధూరం లాంటి సినిమాలను దర్శకుడిగా కృష్ణవంశీ రేంజ్‌ను చాటిచెప్పే సినిమాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం తనదైన మార్క్ సినిమా చేయలేక విఫలమవుతూ వస్తోన్న కృష్ణవంశీ, తాజాగా ఓ సరికొత్త ప్రయత్నంతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకూ ఫ్యామిలీ, రొమాన్స్, డ్రామా జానర్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చిన కృష్ణవంశీ, తన కొత్త సినిమాను ఓ ఫాంటసీ సినిమాగా తీయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయట. లేడీ ఓరియంటడ్ కథాంశంతో రూపొందే ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హీరోయిన్‌ను సంప్రదిస్తున్నారని సమాచారం. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో నిర్మితం కానున్న ఈ సినిమా ఓ ప్రముఖ బ్యానర్‌లో రూపొందనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు