ఆగష్టులో సీనియర్ హీరో షూటింగ్ !

ఆగష్టులో సీనియర్ హీరో షూటింగ్ !

Published on Jul 11, 2020 8:19 AM IST

సీనియర్ హీరో డా. రాజశేఖర్ హీరో కొనసాగడానికి ఇంకా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన ‘గరుడవేగ’ హిట్ తో తెలుగు ప్రేక్షుకులకు తన హీరోయిజాన్ని ఇంకా చూపించే ప్రయత్నం బలంగానే చేస్తున్నాడు. ప్రస్తుతం తన తరువాత సినిమా పై చాల సీరియస్ గా దృష్టి పెట్టాడట ఈ సీనియర్ హీరో. ‘పూలరంగడు, అహన పెళ్ళంట’ చిత్రాల డైరెక్టర్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సరికొత్త తరహా కథాంశంతో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో రాజశేఖర్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఆగష్టు ఫస్ట్ వీక్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది.

మొదటి షెడ్యూల్ లో ఈ సినిమాలోని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఎమోషనల్ సాగే ఆ సన్నివేశాల్లో రాజశేఖర్ తో పాటు మిగిలిన నటీనటులందరూ కూడా పాల్గొనబోతున్నారట. ఇక రాజశేఖర్ గరడవేగ, కల్కి లాంటి సినిమాలు తర్వాత నటిస్తుండటంతో ఈ చిత్రం పై సహజంగానే కొంతవరకు అంచనాలు ఉండొచ్చు. అయితే దర్శకుడు వీరభద్రం చౌదరి ట్రాక్ రికార్డ్, ఆయన గత సినిమా ఫలితం దృష్టిలో పెట్టకుంటే ఈ చిత్రానికి అది మైనస్ గా నిలిచే అవకాశం ఉంది. మరి రాజశేఖర్ కి ఈ చిత్రం ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు