‘శర్వా’ తండ్రిగా సీనియర్ హీరో ?

‘శర్వా’ తండ్రిగా సీనియర్ హీరో ?

Published on Jun 14, 2026 5:02 PM IST

దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పై కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో ప్రత్యేక పాత్రను శ్రీను వైట్ల డిజైన్ చేశారట. పైగా ఈ పాత్రలో ఓ బాలీవుడ్ సీనియర్ హీరో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతకీ, ఈ పాత్ర ఏమిటంటే.. శర్వా పాత్రకు తండ్రి పాత్ర అని.. ఫ్లాష్ బ్యాక్ లో ఈ పాత్ర వస్తోందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమా షూటింగ్ కోసం శ్రీను వైట్ల లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ షూటింగ్ కోసం సన్నాహాలు చేసుకుంటోంది.

కాగా జులై రెండో వారం నుంచి ఈ సినిమా ఓపెనింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని, అనంతరం ఆగస్టు లో జరగబోయే రెండో షెడ్యూల్ లో శర్వానంద్ పై ఓ సాంగ్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇక గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు