బాలయ్య సినిమాలో విలన్ గా మరో సీనియర్ హీరో ?

Published on Dec 14, 2019 9:00 am IST

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ప్రై ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను మెయిన్ విలన్ గా, సోనాక్షి సిన్హాని హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ మరో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ ఇంతకు ముందు నాగచైతన్య ‘యుద్ధం శరణం’లో విలన్ గా నటించాడు.

కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్రంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉండదట. కేవలం ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఇప్పటికే బోయపాటి బాలయ్య కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే, వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. మరి ప్లాప్ ల్లో ఉన్న ఈ హిట్ కాంబినేషన్ హిట్ కొడుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More