సమంత సినిమాలో సీనియర్ హీరోయిన్ !

సమంత ప్రధాన పాత్రలో కన్నడ హిట్ చిత్రం ‘యు టర్న్’ అదే పేరుతో తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్ర షూటింగ్ కూడ మొదలైంది. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ భూమిక కూడ నటించనున్నారట.

గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న భూమిక ఈమధ్యే నాని నటించిన ‘ఎం.సి.ఏ’ తో రీ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈమె నాగ చైతన్య, చందు మొండేటిల ‘సవ్యసాచి’లో కూడ చైతన్యకు అక్కగా నటిస్తోంది. ఇకపోతే ఈ రీమేక్ ను తెలుగుతో పాటు తమిళంలో కూడ ఒకేసారి రూపొందించనున్నారు.