ఎమోషనల్ సిరీస్ లో సీనియర్ హీరోయిన్స్ !

Published on Apr 19, 2021 4:00 pm IST

సీనియర్ హీరోయిన్ మీనా “కరోలిన్ కామాక్షి” పేరుతో తెరకెక్కిన ఓ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. అలాగే మీనా మరో వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. తమిళ నూతన దర్శకుడు మాధవన్ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తాడని.. ఇక ఈ వెబ్ సిరీస్ లో మరో సీనియర్ హీరోయిన్ జయసుధ కూడా నటించనుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, జూన్ నుండి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

కాగా వయసు అయిపోయిన తల్లి కోసం, భర్తను పిల్లలను వదిలేసి వచ్చి తల్లికి సేవ చేసే ఎమోషనల్ క్యారెక్టర్ కి సంబంధించి ఈ సిరీస్ సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో మీనా పాత్ర చాల ఎమోషనల్ గా ఉండనుందని.. మొత్తానికి ఎమోషనల్ సిరీస్ లో ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ నటించబోతున్నారని తెలుస్తోంది. అన్నట్టు మీనా తమిళంలో ఒక సినిమాతో పాటు ఒక సీరియల్ లో కూడా నటిస్తోంది. అలాగే తెలుగులో కూడా వెంకటేష్ దృశ్యం 2 సినిమాలో కూడా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :