ప్రముఖ నిర్మాత కన్నుమూత !

Published on Oct 27, 2018 10:13 am IST

ప్రముఖ సీనియర్ నిర్మాత కామాక్షి మూవీస్ అధినేత డి. శివ ప్రసాద్ రెడ్డి (62) చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈరోజు ఉదయం 6: 30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన1985లో కామాక్షి మూవీస్ బ్యానర్ ను స్థాపించి ఎన్నో మంచి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు.

హీరో నాగార్జున కు శివప్రసాద్ రెడ్డి తో మంచి సాన్నిహిత్యం వుంది. ఆయన బ్యానర్ లో నాగార్జున హీరోగా ‘విక్కీ దాదా ,అల్ల‌రి అల్లుడు, ఆటోడ్రైవ‌ర్, సీతారామ‌రాజు, ఎదురులేని మ‌నిషి, నేనున్నాను, బాస్, కింగ్, కేడి , ర‌గ‌డ‌, ద‌డ‌, గ్రీకువీరుడు’ వంటి చిత్రాలు నిర్మించారు. ఇక ఇటీవల తన ఆప్త మిత్రులు , హరికృష్ణ , రవీందర్ రెడ్డి లను కోల్పోయిన నాగ్ ఇప్పుడు శివ ప్రసాద్ రెడ్డి రూపంలో మరో స్నేహితుడిని కోల్పోయారు.

సంబంధిత సమాచారం :