తెలుగులో తొలి ఏఐ మూవీ.. ‘యమ కింకరుడు’ ట్రైలర్ ఆవిష్కరించిన నిర్మాత కె.ఎస్. రామారావు

తెలుగులో తొలి ఏఐ మూవీ.. ‘యమ కింకరుడు’ ట్రైలర్ ఆవిష్కరించిన నిర్మాత కె.ఎస్. రామారావు

Published on Jul 22, 2026 8:00 AM IST

ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన ‘యమ కింకరుడు’ చిత్ర ట్రైలర్‌ను సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు ఆవిష్కరించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా పూర్తిస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. ట్రైలర్ బాగుందని అభినందించిన కె.ఎస్. రామారావు, కొత్త ప్రయోగంతో ముందుకు వచ్చిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ చిత్రంలో సీనియర్ నటుడు సుమన్ ఒక కీలక పాత్రలో నటించారు. ఆయన పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కె.ఎస్. రామారావు పేర్కొన్నారు. సుమన్ రాకతో చిత్ర స్థాయి మరింత పెరిగిందని తుమ్మలపల్లి రామసత్యనారాయణ వెల్లడించారు. సాంకేతికంగా, కథాపరంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కథ, కథనం, దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలను తుమ్మలపల్లి రామసత్యనారాయణే పర్యవేక్షించారు. కాగా, ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

తాజా వార్తలు