ఆ సినిమాలన్ని సెప్టెంబర్‌ని టార్గెట్‌గా పెట్టుకున్నాయా?

Published on Aug 12, 2021 1:00 am IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ సినిమా థియేటర్లు జూలై 30నుంచి తెరుచుకోవడంతో చిన్న చిన్న సినిమాలన్ని ఒక్కొక్కటిగా థియేటర్లకు క్యూ కట్టాయి. అయితే బయట పరిస్థితులు చూసి ఓటీటీల వైపు కొన్ని సినిమాలు మళ్లినా కూడా చాలా మటుకు సినిమాలు ఇంకా రిలీజ్ డేట్లను ప్రకటించకుండా సందిగ్ధంలోనే ఉన్నాయి. అయితే ఏపీలో కేవలం మూడు షోలకు మాత్రమే అనుమతి ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ నడుస్తుండంతో ఈ అంశం నిర్మాతలను ఒకింత కలవరపెడుతుంది.

అయితే ప్రస్తుతం నాని టక్ జగదీష్, నాగ చైతన్య లవ్ స్టోరీ, గోపీచంద్ సీటీమార్, రానా విరాట పర్వం, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్, నాగ శౌర్య వరుడు కావలెను వంటి చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలన్నిటిని సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని చూస్తున్నారట. అయితే అక్టోబర్‌లో “ఆర్ఆర్ఆర్” ఉండడంతో అంతకు ముందే ఈ మీడియం బడ్జెట్ సినిమాలన్నిటినీ థియేటర్లలో రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తుది. ఇదే కనుక నిజమైతే సెప్టెంబర్ నెలలో థియేటర్స్ మోతెక్కిపోవడం ఖాయమని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :