లైంగిక ఆరోపణలతో “బిగ్ బాస్” పై నీలినీడలు.

Published on Jul 14, 2019 2:00 pm IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ 3ఈనెల 21న గ్రాండ్ గా మొదలుకానుంది. మొదటి రెండు సీజన్స్ తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందడంతో ఈ మూడవ సీజన్ పై కూడా తెలుగు రాష్ట్రాలలో ఈ రియాలిటీ షో పై అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి తోడు ఈసారి కింగ్ నాగార్జున బిగ్ బాస్ 3కి వ్యాఖ్యాతగా రంగంలోకి దిగడంతో అందరూ బిగ్ బాస్ 3కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కానీ ఈసారి బిగ్ బాస్ 3 మొదలు కాంకుండానే వివాదాలకు కేంద్రబిందువైంది. సాధారణంగా బిగ్ బాస్ 3 కాన్సెప్ట్,అందులో పాల్గొనే సభ్యుల వేషధారణ, మాటతీరుపై ఎపిసోడ్స్ ప్రసార సమయంలో వివాదాలు తలెత్తడం సహజం. ఈసారి మాత్రం అసలు షో మొదలుకాకముందే సమస్యలలో చిక్కుకుంది. కొద్దీ రోజులుగా నటి,యాంకర్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ షో నిర్వహణలో బాగమైన కొందరు వ్యక్తులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈసందర్భంగా ఈమె ఈ ప్రోగ్రాం ఇంచార్జ్‌లు అయిన శ్యామ్, రఘు అనే ఇద్దరు వ్యక్తులపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీస్ అధికారులు విచారణ చేపడతాం అని హామీ ఇచ్చారట. బిగ్ బాస్ రియాలిటీ షో పై ఇప్పటికే సంప్రదాయవాదులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న తరుణంలో, ఇలాంటి ఆరోపణలతో ఈ షో నిర్వహణ మరింత కఠినం కానుంది.

సంబంధిత సమాచారం :

More