వైరల్ అవుతోన్న ప్రభాస్ ‘సాహో’ లేటెస్ట్ వీడియో !

Published on Mar 3, 2019 10:07 am IST

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సాహో’. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఆదివారం శ్రద్ధా కపూర్ తన 33వ పుట్టిన రోజును జరుపుకోబోతుంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ‘షేడ్స్ ఆఫ్ సాహో- చాప్ట‌ర్ 2’ పేరుతో సాహో చిత్రబృందం మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది.

కాగా మేకింగ్ వీడియోలోని షాట్స్ కంపోజింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. అలాగే శ్రద్ధాకపూర్‌ కు సంబంధించి ఎలివేషన్ షాట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘యు.వి క్రియేషన్స్’ ఈ సినిమాను నిర్మస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :