బయోపిక్ కు సిద్దమవుతున్న షారుక్ ఖాన్ !
Published on Mar 13, 2018 2:26 am IST


బాలీవుడ్లో బయోపిక్స్ హవా నడుస్తున్న నైపథ్యంలో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కూడ బయోపిక్ లో నటించేందుకు సిద్దంకానున్నారు. ప్రస్తుతం ‘జీరో’ చిత్ర షూటింగ్లో ఉన్న ఆయన ఏప్రిల్ చివరి నాటికి ఆ చిత్రీకరణ ముగించి ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కబోయే బయోపిక్ కోసం సిద్ధం కానున్నారు.

ఈ ప్రిపరేషన్ కోసం సుమారు మూడు నెలల సమయం తీసుకోనున్న షారుక్ రాకేష్ శర్మ గురించి అన్ని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని, తనని తాను మానసికంగా, శారీరంకంగా సినిమాకు సిద్ధం చేసుకోనున్నారట. ‘సెల్యూట్’ అనే పేరు ప్రస్తావనలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్లో మొదలై 2019లో పూర్తవుతుందట. సినిమా కూడ అదే ఏడాది విడుదలయ్యే అవకాశాలున్నాయని బీ టౌన్ టాక్.

 
Like us on Facebook