హీరోకి గాయం..షూటింగ్ కి బ్రేక్

Published on Jan 11, 2020 10:45 am IST

నాని, శ్రద్దా శ్రీనాధ్ జంటగా గత ఏడాది విడుదలైన జెర్సీ ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటరైనర్ గా నిలిచింది. నాని కెరీర్ లో బెస్ట్ మూవీగా జెర్సీ నిలిచిపోయేంతగా ఆయన నటన కనబరిచారు. పెళ్ళైన స్ట్రగులింగ్ క్రికెటర్ గా నాని చాలా బాగా నటించారు. కాగా ఈ చిత్రం హిందీలో రీమేక్ అవుతుంది. షాహిద్ కపూర్ హీరోగా తెలుగు జెర్సీ తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో షాహిద్ ప్రమాదానికి గురయ్యారు.

షూటింగ్ భాగంగా షాహిద్ కపూర్ క్రికెట్ ఆడుతున్నపుడు బంతి ఊహించని విధంగా వచ్చి ముఖానికి తగిలి దిగువ పెదవిపై తీవ్ర గాయమైంది. షాహిద్ కపూర్ పెదవి చిట్లి రక్తం రావడంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టరు అతని పెదవికి కుట్లు వేశారు. పెదవిపై అయిన గాయం నయం అవడంతోపాటు వాపు తగ్గే వరకూ నాలుగైదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు షాహిద్‌కు సూచించారు. దీంతో ఈ సినిమా షూటింగును ఐదు రోజుల పాటు నిలిపివేశారు.

సంబంధిత సమాచారం :