షారుక్ ఖాన్ కి అరుదైన గౌరవం

Published on Jun 14, 2019 2:10 am IST

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరగనున్న వార్షిక భారతీయ చలన చిత్ర ప్రదర్శన ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆస్ట్రేలియా కి చెందిన విక్టోరియా గవర్నమెంట్ ఆయనకు ఆహ్వానం పంపించింది. ఈ కార్యక్రమానికి రావడానికి షారుక్ ఒకే అన్నారట. దీనితో ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్న మిగతా అతిధులతో పాటు గా ఈనెల 8న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని సమాచారం.

గత సంవత్సరం ‘జీరో’ అనే ఓ ప్రయోగాత్మక మూవీ లో మరుగుజ్జు గా కనిపించారు షారుక్ ఖాన్. ప్రస్తుతాని ఆయన మరో కొత్త మూవీ కి కమిట్ కాలేదు, విక్రమ్ వేదా తమిళ్ రీమేక్, అలాగే డాన్-3, కరణ్ జోహాన్ మూవీలో నటిస్తారు అని అనేక ఊహాగానాలు వచ్చినా ఒక్క ప్రాజెక్ట్ కూడా కార్యరూపం దాల్చలేదు.

సంబంధిత సమాచారం :

More