జైల్లో ఆర్యన్ ఖాన్..షారుఖ్ కలసి మాటలు.!

Published on Oct 21, 2021 12:11 pm IST


గత కొన్ని వారాల క్రితమే బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో ఒకరైన షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఓ డ్రగ్స్ కేసు విషయంలో ముంబై పోలీస్ చేత అరెస్ట్ తెలిసిందే. అయితే ఈ కేసు బలంగా ఉండడం చేత ఆర్యన్ ని బెయిల్ రావడం చాలా కష్టతరంగా మారింది అని రీసెంట్ గానే కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ కేసుపైనే లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది.

ప్రస్తుతం అయితే ఆర్యన్ ఖాన్ ముంబై లోని ఆర్థర్ జైలు లో శిక్ష అనుభవిస్తుండగా షారుఖ్ అతడిని కలుసుకోవడానికి వెళ్లడం జరిగింది. అంతే కాకుండా ఆర్యన్ తో కలిసి షారుఖ్ లోపలే ఒక అరగంట పాటుగా ఉండి మాట్లాడి బయటికి వచ్చారు. ఇప్పుడు ఆ విజువల్స్ నే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి మొత్తానికి మాత్రం ఆర్యన్ ని బయటకి తీసుకురావడానికి షారుఖ్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు కానీ అవేవి ఇప్పట్లో సఫలం అయ్యేలా లేవని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More