విడుదలకు రెడీ అయిన షకీలా బయోపిక్

Published on Dec 2, 2020 1:00 am IST

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా విద్యా బాలన్ ప్రధాన పాత్రలో ‘డర్టీ పిక్చర్’ రూపొందిన బాలీవుడ్లోనే మరొక ప్రముఖ నటి షకీలా జీవితం ఆధారంగా ‘షకీలా’ పేరుతో బయోపిక్ రూపొందింది. 90ల దశకంలో మలయాళ చిత్ర పరిశ్రమలో ఏ రేటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంది షకీలా. అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా ఉండేది ఆమె క్రేజ్. ఆమె సినిమా వస్తోందంటే పెద్ద హీరోల సినిమాలు కూడ వెనక్కి తగ్గిన సంధర్భాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

అలాంటి సంచలన నటి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తు పల్లాలు, ఆసక్తికరమైన వ్యక్తుల పాత్రలు ఉన్నాయి. వాటిని తెర మీద
ఆవిష్కరించాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను రూపొందించారు కన్నడ ఫిల్మ్ మేకర్ ఇంద్రజిత్ లంకేష్. ఈ చిత్రంలో షకీలా పాత్రను బాలీవుడ్ నటి రిచా చద్దా చేయడం జరిగింది. గత ఏడాదిలోనే ఈ సినిమా రావాల్సి ఉండగా పలు కారణాల వలన వాయిదాపడుతూ వచ్చి ఎట్టకేలకు ఈ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. డిసెంబర్ 25న మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More