నారా రోహిత్ సినిమాతో షామిలి రీ ఎంట్రీ!

నారా రోహిత్ సినిమాతో షామిలి రీ ఎంట్రీ!

Published on Oct 2, 2015 5:00 PM IST

shamili
షామిలి.. బేబీ షామిలిగా తెలుగు, తమిళ భాషల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ నటి, 2009లో విడుదలైన ఓయ్ సినిమాతో హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చారు. తన మొదటి సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించకపోవడంతో కొన్నాళ్ళు గ్యాఫ్ తీసుకున్న షామిలి తాజాగా మళ్ళీ ఆరేళ్ళ తర్వాత తన రీ ఎంట్రీ సినిమాకు సినిమాకు సిద్ధమవుతున్నారు. నారా రోహిత్ హీరోగా ‘కథలో రాజకుమారి’ అన్న ఆసక్తికర టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు మహేష్ సురపనేని దర్శకత్వం వహించనున్నారు.

ఇప్పటికే పలు ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతోన్న నారా రోహిత్, ఈ సినిమాను కార్తికేయ నిర్మాత శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో షామిలి, తన మొదటి సినిమా ఓయ్‌లో కనిపించిన దానికి పూర్తి భిన్నమైన లుక్‌తో అలరించనున్నారని తెలుస్తోంది. డిసెంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు