భారతీయుడు2 విడుదల డేట్ ఫిక్సయింది…!

Published on Aug 9, 2019 1:13 am IST

ప్రస్తుతం దర్శకుడు శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్న “భారతీయుడు2” షూటింగ్ కొరకు సిద్ధమవుతున్నారు. త్వరలో రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఈ చిత్ర షూటింగ్ జరిగే అవకాశం కలదని సమాచారం. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావాల్సివుండగా, దర్శకుడికి,నిర్మాతలకు మధ్య బడ్జెట్ విషయంలో తలెత్తిన వివాదాల రీత్యా కొంచెం ఆలస్యమైంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్,ఐశ్వర్య రాజేష్ , ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటిస్తుండగా హీరో సిధార్థ ఓ కీలకపాత్ర చేయనున్నారు.

కాగా తాజా సమాచారం ప్రకారం దర్శకుడు శంకర్ ఈ మూవీ విడుదల తేదీ కూడా ఫిక్స్ చేసేశాడట. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నాడని సమాచారం. అప్పుడు తమిళుల నూతన సంవత్సరం కావడంతో పాటు వేసవి సెలవులు కలిసి రావడం వలన మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంటుందని ఆయన ఆలోచనట. ఏప్రిల్ అంటే ఈ మూవీ విడుదలకు కేవలం 9నెలల సమయం మాత్రమే ఉంది. మిగతా దర్శకులకైతే ఇది చాలా ఎక్కువ సమయమే, శంకర్ లాంటి భారీ చిత్రాల దర్శకులకు ఇది తక్కువ సమయం అనుకోవాలి. మరి శంకర్ చెప్పినట్లుగా ఏప్రిల్ కి భారతీయుడు2 ని థియేటర్లలో దించుతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :