శంకర్ దర్శకత్వంలో విజయ్…?

Published on Dec 9, 2019 8:26 pm IST

తలపతి విజయ్ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఆయన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటూ పోతున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ బిగిల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక తన 64వ చిత్రం టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో వర్సిటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్ రోల్ చేయడం విశేషం. ఈ మూవీలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా మాఫియా డాన్ గా రెండు భిన్న గెటప్స్ లో కనిపించనున్నారని ప్రాధమిక సమాచారం.

కాగా ఈ చిత్రం తరువాత ప్రముఖ దర్శకుడు శంకర్ తో విజయ్ మూవీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. శంకర్ హీరో విజయ్ కొరకు ఓ స్క్రిప్ట్ సిద్ధం చేయగా దీనిపై త్వరలోనే వీరిమధ్య చర్చలు జరిగే అవకాశం కలదని తెలుస్తుంది. గతంలో వీరిద్దరూ హిందీ చిత్రం 3 ఇడియట్స్ ని రీమేక్ చేయడం జరిగింది. శంకర్ తెరకెక్కించిన ఫస్ట్ రీమేక్ చిత్రం అదే కావడం విశేషం. ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్ 2 తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్, రకుల్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సిద్ధార్ధ్ ఓ కీలక రోల్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :

X
More