ప్రభాస్‌తో ‘బాహుబలి’ని మించిన సినిమా.. నిజమేనా ?

Published on Dec 10, 2019 3:36 pm IST

‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయి సినిమాను రూపొందించడానికి తెలుగు, హిందీల్లో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి పూర్తిగా విజయవంతం కాలేదు. ఇప్పుడు మరోసారి ఆ ప్రయత్నం తమిళంలో జరగబోతుందని టాక్. ఈ ఆలోచన వచ్చింది కూడా స్టార్ డైరెక్టర్, బిగ్ బడ్జెట్ సినిమాల స్పెషలిస్ట్ శంకర్ కు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

అవును డైరెక్టర్ శంకర్ ప్రభాస్‌తో ఒక భారీ బడ్జెట్ సినిమా రూపొందించాలనే ఆలోచన చేస్తున్నారట. అది పాన్ ఇండియా స్థాయిలో, బాహుబలిని మించేలా ఉంటుందని టాక్. సాధారణంగా ఒక రీజియన్లోనే మార్కెట్ ఉన్న హీరోలతో పెద్ద బడ్జెట్ సినిమాలు చేసే శంకర్ హిందీలో సైతం హెవీ మార్కెట్ ఉన్న ప్రభాస్‌తో సినిమా అంటుండటంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

అయితే ఈ వార్తలు నిజమా కాదా అనేదే ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం శంకర్ ‘ఇండియన్ 2’ షూటింగ్లో బిజీగా ఉండగా ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్లో ‘జాన్’అనే సినిమా చేస్తున్నారు. బహుశా ఇవి పూర్తయ్యేలోపు ఈ విషయంపై క్లారిటీ రావొచ్చు.

సంబంధిత సమాచారం :

More