మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కోన వెంకట్ మరియు గోపి మోహన్ కథని అందించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేసింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ సినిమా ద్వారా ఒక యంగ్ హీరో తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి సిద్దమయ్యాడు.
యంగ్ హీరో నిఖిల్ నటించిన నెక్స్ట్ మూవీ ‘శంకరాభరణం’. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయిన ఈ సినిమా థియేటర్ ట్రైలర్ ని బ్రూస్ లీ సినిమాతో పాటు థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. శంకరాభరణం నిర్మాత కోన వెంకట్ కావడం వలన బ్రూస్ లీ తో పాటు తన సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాతో ట్రైలర్ ని లాంచ్ చేస్తే తమ సినిమాకి కూడా మంచి క్రేజ్ వస్తుందని భావించి ఇలా ప్లాన్ చేసారు. బ్రూస్ లీ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో కనిపించనుండడం విశేషం.


