జూలై 5న రానున్న గ్యాంగ్ స్టర్ !

Published on May 16, 2019 8:12 am IST

వైవిధ్యమైన పాత్రల కథానాయకుడు
శర్వానంద్ ప్రస్తుతం రెండు విభిన్న పాత్రల్లో హీరోగా నటిస్తుండగా..
‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జూలై 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

కాగా ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రీ లుక్ పోస్టర్ లో శర్వానంద్ లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ చిత్రంలో చాలా భాగాన్ని విదేశాలలో చిత్రీకరించారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్ తో పాటు కళ్యాణి ప్రియదర్శిని కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు దళపతి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక శర్వానంద్ ప్రస్తుతం 96 తెలుగు రీమేక్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

సంబంధిత సమాచారం :

More