శర్వా లుక్ మారింది !

Published on Feb 20, 2019 12:06 pm IST

కథాబలం వున్నా చిత్రాలను ఎంచుకుంటూ సినిమాలు చేసే హీరోల్లో శర్వానంద్ ఒకరు. అయితే ఇటీవల ‘పడి పడి లేచె మనసు’ తో ప్రేక్షకులముందుకు వచ్చిన శర్వాకి ఆ చిత్రం విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఈ చిత్రం తరువాత ప్రస్తుతం అయన ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాలో కాజల్ అగర్వాల్,కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుంది. ఈషెడ్యూల్ లో 250 మంది డ్యాన్సర్ లతో శర్వా , కాజల్ ఫై సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా స్టిల్స్ లో శర్వా మిడిల్ ఏజ్డ్ పర్సన్ లుక్ లో డిఫ్రెంట్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శర్వా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. అందులో ఒకటి యువకుడి పాత్రా కాగా మరొకటి మిడిల్ ఏజ్డ్ పాత్ర. తాజాగా విడుదలైన స్టిల్ ఈ పాత్రకు సంబంధించినదే. గ్యాంగ్ స్టార్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :