‘నారీ నారీ నడుమ మురారి’ కి ముగించిన శర్వానంద్.. ఇక ప్రమోషన్స్‌తో స్పీడ్ పెంచేల్సాందే..!

‘నారీ నారీ నడుమ మురారి’ కి ముగించిన శర్వానంద్.. ఇక ప్రమోషన్స్‌తో స్పీడ్ పెంచేల్సాందే..!

Published on Jan 2, 2026 10:00 PM IST

Nari Nari Naduma Murari

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి.

ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను శర్వానంద్ తాజాగా ముగించాడు. ఈ మేరు మేకర్స్ ఓ అధికారిక ప్రకటన కూడా చేశారు. డబ్బింగ్ ముగిసిందని.. ఇక ప్రమోషన్స్‌తో జోరందుకోవడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగే వ్యక్తిగా శర్వానంద్ కనిపిస్తాడు.

ఈ మూవీలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

తాజా వార్తలు