ట్రైలర్ ట్రాక్: ట్రెండీ అండ్ ఫన్నీగా ‘నారీ నారీ నడుమ మురారి’

ట్రైలర్ ట్రాక్: ట్రెండీ అండ్ ఫన్నీగా ‘నారీ నారీ నడుమ మురారి’

Published on Jan 11, 2026 5:56 PM IST

Nari-Nari-Naduma-Murari-Tra

ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రాబోతున్న పలు సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రాల్లో శర్వానంద్ హీరోగా సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్ గా దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఎంటర్టైనర్ చిత్రం “నారీ నారీ నడుమ మురారి”(Nari Nari Naduma Murari) కూడా ఒకటి. ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి ఫైనల్ గా ట్రైలర్ అయితే బయటకి వచ్చేసింది.

మరి ఈ ట్రైలర్ మంచి ఫన్ తో ఎంటర్టైనింగ్ గా సాగింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఒక లవ్, గతంలో ఒక లవ్ స్టోరీలతో శర్వానంద్ రోల్ కనిపిస్తుండగా మళ్ళీ నటుడు సంపత్ తో రన్ రాజా రన్ తరహా సీక్వెన్స్ లలో కనిపిస్తున్నాడు. అలాగే సంయుక్త, సాక్షి వైద్యలతో ట్రాక్ లు కూడా వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా సత్య, నరేష్, వెన్నెల కిషోర్ ఇలా అందరితో సాలిడ్ కామెడీ ట్రాక్ లు సింగిల్ లైనర్స్ సినిమాలో హైలైట్ గా ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా దర్శకుడు ట్రెండీగా తీసుకున్న కామెడీ టచ్ ఇందులో బాగుంది. సో ఈ సంక్రాంతికి మరో ప్రామిసింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జనవరి 14 సాయంత్రం నుంచి సినిమా థియేటర్స్ లో పడనుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్క్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు