షూట్ కంప్లీట్ చేసుకున్న శర్వా ఇంటెన్స్ డ్రామా.!

Published on Jul 9, 2021 11:00 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్ మరియు అదితి రావు హైదరీ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఇంట్రెస్టింగ్ ఇంటెన్స్ డ్రామా చిత్రం “మహా సముద్రం”. టాలెంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటుడు సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు. చాలా కాలం తర్వాత సిద్ధార్థ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా కూడా ఇదే.

అయితే కొంత కాలం నుంచి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావు రమేష్ సహా తదితర కీలక నటులు స్ట్రాంగ్ రోల్స్ తో వస్తున్నారు. మరి ఈ చిత్రం తాలూకా టోటల్ షూట్ ఎట్టకేలకు అంతటినీ కంప్లీట్ చేసుకున్నట్టుగా మేకర్ తెలిపారు. అలాగే థియేట్రికల్ రిలీజ్ కే కన్ఫర్మ్ చేసిన ఈ చిత్రం తొందరలోనే ప్రమోషన్స్ ని కూడా మేకర్స్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :