చార్మింగ్ స్టార్ శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శర్వానంద్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి విడుదలైన శర్వానంద్ రగ్గడ్ లుక్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి పోస్టర్లకు ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ లభించింది.
1960ల నాటి తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నే వేసిన ఒక భారీ సెట్‌లో, ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో సుమారు 20 రోజుల పాటు సాగే హై-వోల్టేజ్ ఎమోషనల్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్ కోసం శర్వానంద్ ఎక్కడా రాజీ పడకుండా హై-రిస్క్ స్టంట్స్ చేస్తున్నాడు.
రా యాక్షన్ మరియు బలమైన ఎమోషన్స్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ పీరియాడిక్ విజువల్ వండర్‌ను రాఖీ పండుగ కానుకగా ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. మరి ఈ సినిమాతో శర్వా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.


