శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకం పై ప్రసాద్ చుక్కపల్లి , సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ మూడో వారం నుండి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాను హను రాగఘవపూడి పక్కా స్క్రిప్ట్ తో తెరకెక్కించబోతున్నాడు. ‘పడి పడిలేచే మనసు’ టైటిల్ ఈ సినిమాకు ఖరారు చెయ్యడం జరిగింది.
తాజా సమాచారం మేరకు శర్వానంద్ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 25 ఏళ్ల యువకుడిగా, 45 ఏళ్ల మధ్య వయస్కుడిగా రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఆర్మీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం శర్వానంద్ బరువు తగ్గి స్లిమ్ అయ్యాడు. ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ చిత్రానికి సంగీతం అందించిన విశాల్ చంద్ర శేఖర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు.


