‘నారీ నారీ నడుమ మురారి’కి అదిరిపోయే ఓటీటీ డీల్ !

‘నారీ నారీ నడుమ మురారి’కి అదిరిపోయే ఓటీటీ డీల్ !

Published on Jan 5, 2026 3:02 PM IST

Nari-Nari-Naduma-Murari

శర్వానంద్ హీరోగా రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’(Nari Nari Naduma Murari). తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే సుమారు రూ. 17.5 కోట్లు రాబట్టినట్లు తెలిసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అలాగే, ఈ సినిమాకి సంబంధించి ఇతర హక్కులు కూడా మంచి ధరకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో శ్రీ విష్ణు అతిధి పాత్రలో కనిపించనున్నారు.

అయితే, శ్రీవిష్ణు పాత్రకు సంబంధించిన వివరాలను ఇంకా గోప్యంగానే ఉంచారు. కాగా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా ఉండదని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు