శరవేగంగా సాగుతున్న శర్వానంద్ మూవీ

Sharwanand
యంగ్ హీరో శర్వానంద్ మునుపెన్నడూ కనపడని సరికొత్త లుక్ మరియు సరికొత్త పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన సినిమా ‘రన్ రాజా రన్’. ఆ తర్వాత మనసుకు హత్తుకునే ప్రేమకథ ‘మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇలా వరుసగా రెండు హిట్స్ అందుకున్న శర్వానంద్ ప్రస్తుతం తన తదుపరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ సినిమాకి డైరెక్టర్.

ఇప్పటికే ఈ సినిమాకి ‘ఎక్స్ ప్రెస్ రాజా’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. శర్వానంద్ – మేర్లపాక గాంధీ ఏ మాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూగా వర్క్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నారు. ఇందులో శర్వానంద్ సరసన ఢిల్లీ బ్యూటీ సురభి హీరోయిన్ గా కనిపిస్తోంది. విలక్షణ నటుడు బ్రహ్మాజీ ఈ సినిమాలో ఓ డిఫరెంట్ గెటప్ లో కనిపించి నవ్వించనున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Exit mobile version