సంక్రాంతికే పక్కాగా వచ్చేస్తోన్న దిల్‌రాజు సినిమా!
Published on Nov 14, 2016 12:34 pm IST

shatamanam-bhavati
వరుస విజయాలతో జోరు మీదున్న హీరో శర్వానంద్ ప్రస్తుతం రెండు క్రేజీ సినిమాలను లైన్లో పెట్టి స్టార్ లీగ్‌లో చేరిపోయేందుకు ప్లాన్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఒకటైన దిల్‌రాజు నిర్మాణంలో చేస్తోన్న ‘శతమానం భవతి’ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఈనెల 28కల్లా ఈ షెడ్యూల్‌తో పాటే సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని టీమ్ తెలిపింది.

ఇక ముందే ప్రకటించినట్లుగానే సంక్రాంతికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని దిల్‌రాజు టీమ్ స్పష్టం చేసింది. టీజర్, పోస్టర్స్‌తో ఇప్పటికే మంచి అంచనాలు రేకెత్తిస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ లాంటి టాప్ స్టార్స్ సినిమాలు విడుదలవుతున్నా, తమది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో పండగకే రావాలని టీమ్ భావిస్తోంది. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ లాంటి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు నటిస్తున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook